పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0008-2 సాళంగనాట సం: 05-045

పల్లవి:

చాలుఁజాలును భోగసమయమున మైమఱపు-
పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి

చ. 1:

ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము
కందునని నీ బిగువుఁ గౌఁగిలే వదలె
పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ
బొందుగాదట యేఁటి పొందురా వోరి

చ. 1:

నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ
గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె
వలచినంగనలు తమ వలసిన విలాసముల-
వలను నెరపని దేఁటి వలపురా వోరి

చ. 3:

కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ-
నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె
దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి