పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0008-1 భైరవి సం: 05-044

పల్లవి:

కోవిల పలుకదు కొమ్మావిలతల
దైవిక మిదివో తలకిందాయ

చ. 1:

ఇటునటు యినుఁడిదె యెండలు గాసీ
నటుగతి గిరుల నభములందు
అటువలెఁ గప్పిన యంధకారమిదె
నిటలపుటలుకల నిక్కములాయ

చ. 2:

వెగటునఁ దోఁటల వెన్నెలగాసీ
ఒగిఁ గలువకొలకు లుబ్బఁగను
అగపడి అటువలెనైనాఁ జెలి నీఁ
మొగమునఁ గోపము ముచ్చటలాయ

చ. 3:

సొరిది నలుగడలఁ జుక్కలు గాసీ
నరుదుగ నే నిట్లయినాను
తిరువేంకటగిరి దేవుని కౌఁగిట
కరుణ మన్మథ గ్రహణంబాయ