పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0095-1 మాళవిగౌళ సం: 05-378

పల్లవి:

సీతక పడుసు దోసిటి పాల మగఁడు - బాతి పడిన నగపడునటె వీఁడు

చ. 1:

మూడు గాళ్ళపెద్ద ముసలి సవులుగొన్న పాఁడిమేకల పాల పాశము
వేఁడి జుఱ్ఱినతల్లి వేఁకటియై కన్న- వాఁడు వీఁడు శిన్న వాఁడటె వీఁడు

చ. 2:

కొండలంత సను గుబ్బలరాకాశి - మిండెత గవిశి పై మింగ రాఁగా
గుండె వగులనొక్క కోలనె సరగన -సెండివేసినట్టి సిసు వటె వీఁడు

చ. 3:

వుడుకు నుదుటివాఁడు వుదుటున దాఁసిన- బెడిదపు మోతల పెనువిల్లు
తొడికి విరిశివేశి దోమటి నునుఁబాల- కడుపుల తొలి పెండ్లికొడుకటె వీఁడు

చ. 4:

మారుదల్లి సేతిమాటలఁ బడలేక -వూరు విడిశి యడవులకేఁగి
సేరవచ్చిన యింతి సెవులు ముక్కుఁగోశి - పేరువారిన పెద్దబిరుదటె వీఁడు

చ. 5:

పొగదాగు తపసుల పుల్లవెలుగు మంట - లగడు శేయఁగ ముగురసురల
సగము సాయ సంపి సడిఁబెట్టి విడిశిన-బగిడికాఁడు సిన్నపడుసటె వీఁడు

చ. 6:

మిసమిస మెరసేటి మెగముమెనిపై - పసలఁ దగిలి వెంటఁ బారి పారి
గసిక వింటికోల గరిగాఁడనేసిన -మసిమాయల సలమరి గదె వీఁడు

చ. 7:

రవ్వల సేఁతల రాకాశినాయని - కొవ్విన మదము తె క్కోలుగొని
యివ్వలఁ దిరువేంకటేశుఁడై యున్నాఁడు -గువ్వెక నిను జట్టిగొనెఁగదె వీఁడు