పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0006-5 హిజ్జిజి సం: 05-036

పల్లవి:

కటకటా యిట్లాయఁగా పనులు చెలిపలుకు
కిటుకుఁగీరములు మును కిందుపడి గెలిచె

చ. 1:

ఇంతిముఖచందురుఁడు నీకుముదబాంధవుఁడు
నింతచలమునఁ బోరిరిన్నాళ్ళును
కాంతుఁడవు నీవలుగఁగాఁ జెలికి నీ విరహ-
సంతాపములు రేఁచి జలజారి గెలిచె

చ. 2:

వనజాక్షిచూపులును వలరాజుతూపులును
యెనయకే జగడించె నిన్నాళ్ళును
కినిసి నీవీయతివకెలనఁ దిరుఁగఁగ విరుల-
ననలె కడువాండ్లై నలుగడల గెలిచె

చ. 3;

లతలు పూవులతావిలంచములు చెలిమేన
యితవుగా వడినొసఁగె నిన్నాళ్ళును
సతిగెలిచె వేంకటేశ్వర నీ కరుణనిపుడు
ధృతిఁబూని జవరాలు తిరుఁగఁ దా గెలిచె