పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0006-4 దేశి సం: 05-035

పల్లవి:

లేఁతచిగురిదె పవ్వళించవయ్య కానికె
బాఁతిగాఁ గమ్మనితావిఁ బాయక మీఁటైనది

చ. 1:

ఇంపుల వెలఁగపండ్లిందవయ్య కానికె
గుంపుఁ దేకుటాకు మరఁగున నున్నవి
కెంపుమోవిపండు చిత్తగించవయ్య కానికె
దింపని తేనెలపెరతీపులసోఁకినది

చ. 2:

పంచల వాఁడమ్ములివె పటవయ్య కానికె
పొంచి తొంగలిగరుల పొది నున్నవి
కొంచెపు వెన్నెలలివె కోవయ్య కానికె
మంచిమొల్ల మొగుడల మాఁటునాఁ బాయనివి

చ. 3:

ఇప్పుడె వేంకటేశ నీకెక్కఁగా నాకానికె
చిప్పిలుఁబన్నీటినిండుఁ జెలమైనది
దప్పిదేరేమాటలతో దక్కెఁగా నాకానికె
కొప్పునెరుల విరులకుమ్మరింతలైనది