పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0090-5 శ్రీరాగం సం: 05-354

పల్లవి:

కూరిమిచేఁతలు కొండలుఁ గోట్లయి
గారవించి యింతిఁగాచినది

చ. 1:

వన్నెల మాటల వాకిటితంగెటి-
జున్నుకు వడగాలి సోఁకినది
విన్నని చూపుల వెన్నెల బయిటను
సన్నపు ముత్యాలు చల్లినవి

చ. 2:

ముద్దుల నవ్వులు ముంగిటిబంగారు
అద్దములోఁ జిగురంటినది
తిద్దిన మెఱుంగు దీఁగెకుఁ బన్నీట-
నద్దుట గడు వేడుకైనది

చ. 3:

చక్కని కొండల చరులీ వెన్నెల-
వక్కలు పైపైనె వాలినవి
యెక్కువై శ్రీ వేంకటేశుని కౌఁగిటి-
నొక్కుల కిట్టే నోఁచినది