పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0090-3 నాదరామక్రియ సం: 05-352

పల్లవి:

నెలఁతకుఁ గొండలతిమ్మని నేనిదె తోడ్కొనివచ్చెద
ఎలనాగలు మీరిందరు నేమరకుఁడి చెలిని

చ. 1:

వలపుల రెనికి చెంగలువల కొండము చొర మొక్కుఁడి
అలులకు పూఁదేనియ సోయగములు మెయికొనుఁడి
ఫలరసములు మీఁదెత్తుఁడి పదరి చిలుకలకును గోవిలలకు
పొలఁతికి కెందమ్మిరేకులు పోయుఁడు బడిమిగను

చ. 2:

కట్టుఁడి సన్నపువలిపెము కర్పూరముఁ బన్నీరును
దట్టముగాఁ బైనలఁదుఁడి తరుణీమణికి
ఒట్టుఁడి జాజులు పరపున నొరపెరిఁగిన చెలికత్తెలఁ
బెట్టుఁచి మరుబలములచే బెగ్గిలి పడకుండ

చ. 3:

చిగురునఁ గెంపులు మొలచెను చిత్రము చూడఁగదమ్మా
మొగుడులపైనల చంద్రుని మూఁకలు మరిగినవి
మొగమున బిత్తరిచేఁతలు మును లేనివి చెలికబ్బెను
మగువయు తిరువేంకటపతి మమతల పరిణతలు