పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0090-2 ఆహిరి సం: 05-351

పల్లవి:

ఎడయాట మాటల నేచినవలపు
పొడమిన యాసల పొద్దొకవలపు

చ. 1:

వేఁకమైన కోరికె వినుకలి వలపు
కాఁకలఁ బొరలుటెల్లఁ గనుచూపువలపు
మూఁకలైన తలఁపులు ముదినవలపు
ఆఁకలిదీరని పొందులడియాసవలపు

చ. 2:

నడురేయి గమనము నాఁటినవలపు
విడువనితాపము వేఁడివేఁడివలపు
తడఁబాటు తానౌట తలఁపనివలపు
నిడివేఁడి యూర్పులు నెట్టుకొన్నవలపు

చ. 3:

తిరువేంకటేశుపై తిరమైనవలపు
సరసరీతులచేత సరిలేనివలపు
గురుతైన రచనలు కూడినవలపస
తరుణికి నతనికిఁ దగులైన వలపు