పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0089-6 ముఖారి సం: 05-349

పల్లవి:

చెప్పిన హృదయము దలఁకెడు చెలి దానిపుడెట్లున్నదొ
అప్పుడు పరితాపంబున నలసిన చందములు

చ. 1:

వేడుకతో సంగీతము విని కన్నుల మెచ్చుచు-
నాడుచుఁ బ్రాణేశ్వరుఁగొనియాడెడి చందములు
కాడిన మర్మపుమాటల కంపంబునఁ దలయూఁపుచు
చూడక చూచిన చూపుల చొక్కెడిచందములు

చ. 2:

చనుఁగవ సన్నపు చెమటలు జారెడి పయ్యెదనార్చుచు-
నొసరిన నిట్టూర్పులచే నూటాడెడి చందములు
తనువునఁ బలుమరుఁ బొడమెడి దట్టపు పులకాంకురములు
అనువున మెత్తక కరమున నంటిన చందములు

చ. 3:

తిరువేంకటగిరివల్లభు దేవశిఖామణికౌఁగిట
తరుణి మనోభవుబారినిఁ దప్పిన చందములు
యిరవుగ నాతని చేఁతలు నింపగుఁ బరవశములచే
దొరలిన మరపుల నెరుకలఁ దూలెడి చందములు