పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0089-3 నారణి సం: 05-346

పల్లవి:

పంతపు బిగువులఁ బదరేవు నీ-
వంతలు మానుప వసమా వోరి

చ. 1:

వేఁకపుఁ దురుముల వెలఁదుల యలకల-
చీఁకటి దవ్వుచుఁ జెలఁగేవు
ఆఁకటి చూపులనలసి మలయు నీ-
కాఁకలు మానుపఁగలనా వోరి

చ. 2:

సన్నపు నగవుల సతుల కపోలపు-
వెన్నెలలే యిటు వెదకేవు
వన్నెలతనువున వాడుచు నొయ్యన
తన్నేవు నేనితరమా వోరి

చ. 3:

పడఁతుల కుచముల పరిమళపుఁ జెమట-
తడిపయ్యెదలను దాఁగేవు
కడుఁ గౌఁగిట వేంకటగిరివర నను
పుడికెదవంతకోపుదునా వోరి