పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0089-2 ఆహిరి సం: 05-345

పల్లవి:

అప్పమైన నీయరే యమ్మలాలా నేఁ-
డప్పడా రగించీనదె యమ్మలాలా

చ. 1:

వాడుదేరి వదనము వడదాఁక నిందాఁక-
నాడివచ్చెఁ జూడరే యమ్మలాల
నీడకేఁగనెరఁగఁడు నిక్కపు బాలునివలె
ఆడనీడ దిరిగాడీనమ్మలాల

చ. 2:

వెడ్డు వెట్టీనాటలకు విచ్చేసేనని నన్ను-
నడ్డములాడకురే యమ్మలాల
దొడ్డివారియిండ్లెల్లాఁ దూరి తూరి పారాడీ-
నడ్డములు నిడుపులు నమ్మలాల

చ. 3:

వేఁకువజాముననుండి వెయిమారులారగించు
నాఁకటికోరువలేఁడమ్మలాల
తేఁకువ వేంకటగిరిదేవుఁడైన బాలుఁడిదె
ఆఁకతాడువట్టి తీసీనమ్మలాలా