పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0088-6 మలహరి సం: 05-343

పల్లవి:

నిద్దిరించి పాల జలనిధివలెనే
వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు

చ. 1:

వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించి
బాగుగాఁ గృపారసము పంచి పంచి
యేగతిఁ బవ్వళించెనో యెట్లు భోగించెనో
యోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను

చ. 2:

వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావి
చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరవుచు నొకయింత-
కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర

చ. 3:

సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ
గరుణించఁ దలఁచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించి
విరివి నాలవట్టాలు విసరరే సతులు