పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0088-4 సామంతం సం: 05-341

పల్లవి:

బొంకకురే చతురుఁడప్పుడె వచ్చీనా
సంకు దేరీఁ జూపు మంచి సుద్దో మద్దో

చ. 1:

వన్నెలాఁడి చెలి నీవు వచ్చుదాఁకా యిటె
వున్నదానఁ బ్రాణములునుచుకొని
వున్నతుఁడా తఁడు మమ్మునొలిసీనా యేలె
కన్నుల నవ్వేవు చెలి కాయో పండో

చ. 2:

చక్కనమ్మ నీమాఁట చల్లుదాఁకా యీ-
చెక్కుమీఁది చేతితోను చింతించేను
నిక్కమునాతనికింక నేనేలే నీవు
నొక్కకువే నాచెక్కు నుయ్యో కొండో

చ. 3:

కప్పురగంది యింత దగ్గరకువే నీ-
వప్పుడే కౌఁగిట నన్ను నలమేవు
అప్పఁడు వేంకటవిభుఁడలరించె నిదె
యిప్పుడె యీతనికృప యీఁతో మోఁతో