పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0006-2 సామంతం సం: 05-033

పల్లవి:

ఎక్కడికినెక్కడ యేడకునేడ నే-
నొక్కతెనాతనికటరో సతులు

చ. 1:

ఆయఁబోయ నాఁడె నాకు నాతనికి నేమివోదు
రాయిడి యీచేఁతలకు రాయఁడితఁడు
పాయమెల్లా జట్టిగొనె పచ్చిగా నన్నింత సేసెఁ
నోయమ్మ తడవకురో యీరోఁతలు

చ. 2:

చెప్పకు చెప్పకు నాకు సిగ్గయ్యీనిఁకనేల
నొప్పి సేసె నాతఁడింత నొచ్చితి నేను
కప్పినఁ బోవు సేఁతలు కాలినపుండ్లలోన-
నుప్పులు చల్లక తలరో సతులు

చ. 3:

చాలుఁ జాలు నేల నాఁడే చవిగొన్న కూరలకు
మేలుఁ గీడుఁ గొనియాడ మీఁద మీఁదను
జాలిఁబెట్టి వేంకటేశ్వరుఁడు నన్నిదె రతి-
నోలలాడిండెను చూడరో పొందులు