పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0006-1 ఆహిరి సం: 05-032

పల్లవి:

ఆఁపరాని వలపాయ నమ్మలాలా - యింతి
యేఁపులకు లోనైతిమిఁక నేమిసేతమే

చ. 1:

ఆరగించుమనఁ గదరమ్మలాలా -అయ్యో
నీరు వుక్కలించదిదె నిన్నటనుండి
ఆరినది బోనమెలా నమ్మలాలా-అయ్యో
శ్రీరమణుఁడింతట విచ్చేయఁడేమిసేతమె

చ. 2:

అద్దమరాతీరి వోమ నమ్మలాలా -అయ్యో
నిద్దుర గంటఁబెట్టదు నిన్నటనుండి
అద్దపుఁ జెక్కులు వాడె నమ్మలాలా -అయ్యో
యిద్దరికోపము దీరదిఁక నేమిసేతమే

చ. 3:

అలయికే ఘనమాయనమ్మ లాలా -దీని
నిలుప వశముగాదు నిన్నటనుండి
అలమివేంకటవిభుఁడమ్మలాలా - దీని-
నెలయించి కూడకున్న నిఁకనేమి సేతమే