పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0005-6 సామంతం సం: 05-031

పల్లవి:

పొదలిన వీడెపు బుక్కిళ్ళో తమ
చొదుకుల చెమటల చొక్కిళ్ళో

చ. 1:

ఆముకొనిన యధరామృతవేళల
మోముల మోముల మొక్కిళ్ళో
కామినుల మకరికా పత్రమ్ముల
చీమక దొంతర చెక్కిళ్ళో

చ. 2:

కయ్యపుఁ గౌఁగిఁట గలికి రచనలను
నెయ్యపుఁ బులకల నిక్కిళ్ళో
ముయ్యని మోహపు ముచ్చట మురిపెపు-
తొయ్యలిపాదపుఁ దొక్కిళ్ళో

చ. 3:

మొలకలేనగవు మోముల గోళ్ళ
నులిమేటి వదనపు నుక్కిళ్ళో
అలమేల్‌ మంగకు నా వేంకటపతి
తలపు లొసంగిన దక్కిళ్ళో