పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0005-5 రామక్రియ సం: 05-30

పల్లవి:

మీలో మీలో మేలే పెంచిన-
తాలిమి కూటమి దలఁచినను

చ. 1:

ఆరడిఁ బెట్టిన అలుకలు ముట్టిన-
కూరిమి మచ్చిక గూరిచిన
బీరాన మీలో ప్రేమమే పెంచిన-
నేరుపు మీలో నించినను

చ. 2:

చనవులిచ్చినఁ జదురులెచ్చిన-
కొనచూపులు లోఁగొచ్చినను
అనుగు మోహములచ్చినఁ దెచ్చిన-
వినికి మనికి వెచ్చినను

చ. 3:

ప్రియములింపులు బిరుదుకెక్కిన -
నయము మీలో నాఁటినను
జయమై వేంకటాచల రమణుఁడ
ప్రియురాలు మీలో బెరసెను