పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0005-4 శ్రీరాగం సం: 05-029

పల్లవి:

చెల్లువంటా వచ్చి వచ్చి చెట్టవట్టేవు
తొల్లియు నెందరినిట్టే దొమ్ములఁ బెట్టితివో

చ. 1:

ఆఁపరాని తమకాన నాసచేసేఁ గాక యింత-
మాఁపు దాఁకా నీ తోడి మాటలేలరా
దాఁపరాని మదనముద్రలు మేననవె నీకు
నేఁపుచు భ్రమలఁ బెట్టి యెవ్వతె సేసినవో

చ. 2:

ఉండలేక నీ వద్దనే వుసురంటిఁ గాక యింత-
బండు బండు సేసిన యీప్రాణమేలరా
పుండుగాఁగఁ జిత్తమెల్లాఁ బొక్కఁ జేసితివి నా-
యండనుండే యెవ్వతెకు నమ్ముడు వోయితివో

చ. 3:

తనివోక నేనింత దగ్గరనిచ్చితిఁ గాక
చనువున నిన్ను జేయి చాఁచనిత్తునా
ఘనుఁడ వేంకటరాయ కమ్మని యీ విరులు
మునుపనెవ్వతో నీపై ముడిచి వేసినవో