పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0088-1 కాంబోది సం: 05-338

పల్లవి:

భారపుటూర్పులతోఁ బవళించీవి వీఁడె
కూరిమిసతులు మేలుకొలుపరమ్మా

చ. 1:

వేగినంతకునితఁడు వెలఁదులతోడి రతి
భోగించి వచ్చి నిద్రవోయీని
సోగకనురెప్పలు మూసుక యిప్పుడెంతేసిఁ
జాగరపుఁ బతితోడ చరచరమ్మా

చ. 2:

వొప్పైన సతులతో వుదరములోపల
యిప్పుడు నితఁడు సుఖియించీని
దప్పిదేరు తనమోముఁదమ్మితోడనిదె వీఁడె
వుప్పవడముగఁ బాదాలొత్తరమ్మా

చ. 3:

సరుగున మేలుకొని సరసపుఁ గౌఁగిట
గరగరికెల నన్నుఁ గలసీని
అరవిరి సురమున అలయుచును వీఁడె
తిరువేంకటపతిఁ దెలుపరమ్మా