పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0087-3 ఆహిరి సం: 05-334

పల్లవి:

మోవిపై వీడెపు కెంపు ముచ్చటాడఁగ
చేవవచ్చి చిగురుపైఁ జిమ్మిరేఁగీనే

చ. 1:

వానగుబ్బలమీఁద వల్లెవాటుగా జార-
వేసిన వయ్యెదకొంగు వెంటఁ దూలఁగ
తీసిన ఘాతల ముద్దుఁదీగె చందురులమీఁదఁ
గానేటి వెన్నెలవలెఁ గానవచ్చీనే

చ. 2:

వేఁకపు నెరులకొప్పు వెక్కసపు విరులతో
తేఁకువమీరఁగఁ గడు దీపించఁగా
చీఁకటిలోపల మించు చిన్నిచిన్ని వెన్నెలలు
తోఁకచుక్కలై చూడఁ దొంగలించీనే

చ. 3:

పాదముల దాటించు పసిఁడి మట్టెల మోఁత
మోదపు కంకణరవముల మీరఁగా
గాదిలి నీ కౌఁగిటి వేంకటపతిమీఁదిపాట
వేదముల మీరినట్లు వెదచల్లీనే