పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0087-2 శ్రీరాగం సం: 05-333

పల్లవి:

విరహంపుఁ గోమలికి వెలయంగఁ గలవెల్ల
అరుదుగాఁ బండి పొల్లయిన ఫలమాయె

చ. 1:

వేమారుఁ జెలికి నరవిందశయ్యలె పరవ
బాముచెడి యిందునే బడలెఁ గాని
తామెరై డెందమీ తలిరుదేహములోన
లేమకిది గలిగియును లేని ఫలమాయె

చ. 2:

వెలఁదిమై సురటులనె విసరఁగా లలితాంగి-
నలమి అదియే తాపమయ్యెఁగాని
పెలుచైన నిట్టూర్పు పెనుగాలి లోలోనె
కలిగియును తమవారుగాని ఫలమాయె

చ. 3:

కాంత కనుదోయి నునుఁగలువలై కలువలనె
అంతకంతకు వగల నలపెఁ గాని
యింతలోఁ దిరువేంకటేశుఁ గూడియుఁ జెలికి
చెంతనే కనుదోయి చెంగలువలాయె