పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0085-2 ముఖారి సం: 05-321

పల్లవి:

ఏలే పడుసా యేదేని గుడుసా
చాలునేఁపకువే జవ్వనంపు గడుసా

చ. 1:

వద్దేలే కసరు వలనని కిసరు
పొద్దువొద్దులకుఁ జూపుల యసరు
పెద్దైన వలపుల పిసరు లోన-
న్నద్దేవు నేనైతినసురుసురు

చ. 2:

వచ్చేనేననవే నా వలపు చేకొనవే
మచ్చుచల్లక నామాట వినవే
ఇచ్చేననవే నీహృదయమింతటనైన
రిచ్చపడిన నాకూరిమి గనుఁగొనవే

చ. 3:

రావే సంగడికి రతుల యంగడికి
శ్రీ వేంకటేశుఁడ నా చెంగటికిని
నీవే కౌఁగిటికి నిధులలోఁగిటికి
మోవీవే వెరవక మోహపుటాఁకటికి