పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0084-6 శ్రీరాగం సం: 05-319

పల్లవి:

ఇంతి కన్నీరొలుకనిట్లుఁ జదివె
కొంతంపు కనుఁగొనల కోపమును జదివె

చ. 1:

వెలఁది వినుకలినే వినికి విని తోడనే
తలపోఁతనదివొ చింతనసేసెను
తలకొన్న నేలవ్రాఁతలనె పొలుపుగ వ్రాసె
తొలుతఁ బాదపువేలి ధూళక్షరములు

చ. 2:

పడఁతి కనుకలినే పులకవ్రాలును వ్రాసె
తడవి నీ చెలువ చిత్తపుఁ బలకనే
కడుఁదెలివికిని బాసి కలవెల్ల మఱచి తన-
పెడఁగు జెక్కు చేతితో వెదకినిదివో

చ. 3:

వరుస గంటపువ్రాలు వ్రాసెఁ గొనగోరనే
కురుఁ బసల నీవు చెక్కులు గిల్లఁగా
తిరువేంకటాచలాధిపుఁడ నీతోఁగూడి
సరిలేని శబ్దశాస్త్రములెల్లఁ జదివె