పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0084-5 రామక్రియ సం: 05-318

పల్లవి:

దంతచ్ఛదముద్రా మదనాస్త్రల-
తాంతశాంతికృతిరహోభవతి

చ. 1:

వనితాకుచయోర్వరనఖ రేఖా-
ర్జన శశిచిహ్నం సఫలమిదం
ఘనకరుణాం మయి ఘటయ చంద్ర ఇ-
త్యనునయకారణమహోభవతి

చ. 2:

సతీమణీ విలసత్కరమూలే
చతురలాంఛనం సఫలమిదం
వ్రతతిభయహృతే వరదాస్య కలన-
మతిఘతాకృతిరహో భవతి

చ. 3:

తరుణీ తనుగంధ విలేపన వి-
స్తరసౌభాగ్యం సఫలమిదం
పరిరంభసుఖే తిరువేంకటగిరి-
హరేః పూజనమహో భవతి