పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0084-4 ఆహిరి సం: 05-317

పల్లవి:

తిట్టినఁ దిట్టినదే తప్పా
బెట్టమ్మా గుంపెన నీచేత

చ. 1:

వెనక మరలి నవ్వినదే తప్పా
వినమమ్మా నీ విభుఁడౌట
చెనకఁగ జంకించినదే తప్పా
అనవమ్మా నీ వాతనిఁ గినిసి

చ. 2:

ఎదుట నిలిచి తురుమిడుటే తప్పా
వదలిన పయ్యెద వాలఁగను
అదన నలసి వుసురనుటే తప్పా
వుదుటుఁదమకముననుండఁ గలేక

చ. 3:

కేలనె యిటు మొక్కినదే తప్పా
కాలు దాఁకి వేంకటపతికి
వోలి నే నతనిపై నొరగుటె తప్పా
మేలములాడుచు మెరయఁగనతఁడు