పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0084-3 శంకరాభరణం సం: 05-316

పల్లవి:

జవ్వాది మెత్తినది తన-
జవ్వనమే జన్నెవట్టినది

చ. 1:

ముద్దుల మాఁటలది చెక్కు-
టద్దముల కాంతినలరినది
గద్దరిచూపులది తన-
వొద్ది చెలియమీఁద నొరగున్నది

చ. 2:

పుత్తడిఁ బోలినది తన-
చిత్తము నీసొమ్ముచేసినది
గుత్తపు గుబ్బలది అల-
చిత్తజుని లెక్కసేయనిది

చ. 3:

ఎమ్మెలు యెఱఁగనిది తన-
కెమ్మోవిఁ జిరునవ్వు గెరలున్నది
కమ్ముకొనఁగ వెంకటారాయా నీ-
కమ్మనికౌఁగిటఁ గలశున్నది