పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0084-2 భైరవి సం: 05-315

పల్లవి:

వేంకటాద్రివిభునిఁబాసి విరహియైన రమణిఁ జూచి
రంకెలు వేయనేఁటికమ్మ రాజసమునను

చ. 1:

విసప కోర సోఁకినపుడె వేఁడిలేని చందమామ
మిసిమిగలుగు వేఁడిచూపు మింట మలయునే
నొలికంటికాఁకనణఁగి నొగిలినపుడె తొడుగలేక
కుసుమశరము మదనుఁడతివకొరకు దాఁచెనే

చ. 2:

చిగురుమేఁతకాండ్లెల్ల చెలఁగి మావికొమ్మలెక్కిఁ
మగువమీఁదఁగూఁతరేఁచి మరునిఁగూడిరే
తగవరైన దశరధేంద్రుతనయు శాపమొసఁగినపుడె
తెగువమీఁదఁగూఁతరేఁచ తెరఁగులెరఁగరా

చ. 3:

నెయ్యమలర మంచివిరులశయ్య వేంకటాద్రివిభుఁడు
లియ్యమైనచెలికిఁ జనవులియ్యఁదొణఁ గెనే
కుయ్యవెరచెఁ గోవిలలును కుంకెఁ జందమామకళలు
తియ్యవింటివాఁడు వెనకతియ్యఁదొడఁగెనే