పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0083-5 పాడి సం: 05-311

పల్లవి:

సత్యభామ సరసపు నగవు
నిత్యము హరిమదినే నెలవాయ

చ. 1:

రుకుమిణిదేవికి రూపయవ్వనికి
సకల విభవముల సౌఖ్యతలు
చికురాంబరమునఁ జెదరిన యలకలు
వికచాబ్జముఖము వెయివేలాయ

చ. 2:

తొడవుల శ్రీసతి తొలుమెఱుఁగులమై
నడపుల మురిపెపు నగుమోము
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలిక వాపను పరమంబాయ

చ. 3:

అనుదినమును నీ యలమేలుమంగ
కనుఁగవ జంకెన గర్వములు
దినదినంబులును తిరువేంకటపతి-
చనవుల సొబగుల సంపదలాయ