పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0083-4 భైరవి సం: 05-310

పల్లవి:

కూరిమెరిఁగి కైకోవు-నీ-
బీరములే నెరుపేవు

చ. 1:

రంతులె సేసిటు రావు -
యెంతైనాఁ జననీవు
చెంతలె కడుఁ దలఁచేవు -
ఇంతలోనె రవయ్యేవు

చ. 2:

పొలయుచు నూరకె పోవు-
గిలిగింపుచుఁ దిరిగేవు
చెలఁగుచు వడి మురిసేవు-
నిలరా యించుక నీవు

చ. 3:

బొంకుచు నూరకె పోవు-
తెంకికి నెవ్వతెఁ దేవు
వేంకటపతి నవ్వేవు-
పొంకమైతివిఁకఁ బోవు