పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0083-3 ముఖారి సం: 05-309

పల్లవి:

ఎఱఁగవితని చంద మిట్టివాఁడనుచు నింతి
తెఱవల నీమీఁదఁ దేనోపుఁ జుమ్మీ

చ. 1:

రంగుమీరిన మంచిరత్నాలు దాచిన నీ-
వుంగరాలచేతఁ బాదమొత్తకువవ్మ
అంగన వుట్టెనుఁ బాదమంటి శిలను దొల్లి
కంగి నీకుఁ బ్రతిమొన గడియించీఁ జుమ్మీ

చ. 2:

కొమ్మ నీదు వాలారుగోళ్ళ నితనికిని
యిమ్ములఁ దొడలు సోఁకనియ్యకు వమ్మా
దొమ్ముల సిరుల గోరఁ దొడనింతిఁ బుట్టించె
కమ్మర నీకు నిట్టెకలిగించీఁ జుమ్మీ

చ. 3:

నొక్కుచుఁ జెమటల పానుపున వేంకటపతి-
నుక్కున నీచనుఁగొండలొత్తకువమ్మా
పక్కనను గొండవేసి పానుపుజలది దచ్చె
చక్కని తరుణి నిట్టె సడిఁబెట్టీఁ జుమ్మీ