పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0083-2 పాడి సం: 05-308

పల్లవి:

విభుని వినయములు వినవమ్మా నినుఁ
నభయంబడిగీ నయ్యా తాను

చ. 1:

రహస్యమున శ్రీరమణుఁడు పంపిన
విహరణలేకలు వినవమ్మా
ఆహిపతిశయనంబతితాపంబై
బహువేదనకు అగపడె నటతాను

చ. 2:

అదిమపతి నీ యడుగులు కెరగిన-
వేదాంతరచన వినవమ్మా
నీదయగానక నిమిషమె యుగమై
ఖేదంబున నలఁగీనట తాను

చ. 3:

కింకరుఁడట నీ కినుకసేఁతలకు
వేంకటపతిగతి వినవమ్మా
సంకెలేక నీచనవున జగములు
కొంకకిపుడె చేకొనెనట తాను