పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0083-1 రామక్రియ సం: 05-307

పల్లవి:

కమలాన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులు నింతంతని పలుకంగా రాదు

చ. 1:

మించిన చొక్కులు మీరినయాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలఁపులు యెడపని వలవులు
పంచబాణుని పరిణతలూ

చ. 2:

కనుఁగవ జలములు కమ్మనిచెమటలు
ఆనయముఁ జెలులకు నాడికలు
తనువున మఱపులు తప్పని వెఱపులు
వినుకలి కనుకలి వేడుకలు

చ. 3:

మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతిచిత్తములు
తావుల పూఁతలు దర్పకు వ్రాఁతలు
ఆ విభుఁగూడిన యలసములు