పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0082-6 కన్నడగౌళ సం: 05-306

పల్లవి:

ఏలా యీ యనుమానములింతి మనంబునఁ బాయని-
తాలిమి తప్పుఁదెరువున దాఁగెఁగదోయమ్మా

చ. 1:

మాయపుమంటలు చల్లెడు మందమారుతము
పాయము దిరుగఁబారెడు పండుఁజందురుఁడు
కాయము తల్లడపరపెడు గండుగోయిలలు
యేయెడనోర్వదు చెలిలాగేలాగోయమ్మా

చ. 2:

ఇంటఁ బుట్టిన యాతఁడే యింటఁ బుట్టిన యమ్ముల
యింటఁ బలుమారునేయఁగ నేమందునోయమ్మా
వింటఁ బాసిన శరముల వెంటఁ దగిలెడు నారిని
యంటిన మదనానలమిఁక నారుపరాదమ్మా

చ. 3:

కొండలరాయఁడు చెలిచనుఁ గొండల నించిన గురుతులు
కొండుకచందురులైనవి కొత్తగదోయమ్మ
నిండిన విరహంబింతయు నేఁడిదె యమృతంబాయను
పండిన తమకము మేలై పలియించెనోయమ్మా