పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0083-6 శ్రీరాగం సం: 05-312

పల్లవి:

ఎట్టు సైఁతువె వలపు యింతి పరులు
రట్టునేయఁగ మిగుల రాఁపవునె కొంత

చ. 1:

రాక విభుఁడేఁపటి రాజసంబొకకొంత
చీకాకు పడఁజేయు చింత వొకకొంత
పైకొన్న చిత్తంబు పట్టరానిది గొంత
మేకులకుఁ జెలులాడు మేలమొకకొంత

చ. 2:

పలుమారు వలయించు పరవశంబొకకొంత
పొలయలుకలను బొడము బూకలొకకొంత
కలికి కన్నులఁ బొలయు కాఁతాళమొకకొంత
కొలఁదిమీరిన మంచికోపమొకకొంత

చ. 3:

గరగరిక వేడుకల కలపుకోలొకకొంత
వరుసఁ గోమలమైన వయసులొకకొంత
తిరువేంకటాద్రీశు దివ్యమహిమలు గొంత
సరిలేని పొందికల చనవులొకకొంత