పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0082-4 రామక్రియ సం: 05-304

పల్లవి:

చూడరమ్మ యిటువంటి సుదతులు లేరెందు
యేడనైన నిటువంటి యింతులు వుట్టుదురా

చ. 1:

ముదితనడపులలోని మురిపెమే వెయిసేసు
కొదమగుబ్బలతీరు కోటివేలు సేసు
సుదతిబిత్తరిచూపు సొన్నాటంకాలే సేసు
అదరబింబముతీరు ఆరువేలు సేసు

చ. 2:

సన్నపు నడుము లోని సైకమే లక్షసేసు
పన్నుగాఁ బిరుఁదువన్నె పదివేలు సేసు
యెన్నిక మెఱుఁగుఁదొడలెంతధనమైనఁ జేసు
నున్నఁగా దువ్వినకొప్పునూరువేలు సేసునే

చ. 3:

అంగనభాగ్యమెట్టిదో అతిమోహమై తిరు-
వెంగళరాయనికృప వేవేలు సేసునే
బంగారుచవికెలొఁ బడఁతిఁ గూడిన సొంపు
రంగుగాఁ జెలియరూపు రాజ్యమెల్లఁ జేసునే