పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0082-1 శ్రీరాగం సం: 05-301

పల్లవి:

ప్రతిలేని పూజ దలఁపఁగఁ గోటిమణుఁగులై
అతివ పరవశము బ్రహ్మనందమాయ

చ. 1:

మానినీమణి మనసు మంచియాసనమాయ-
నానందబాష్పజలమర్ఘ్యాదులాయ-
మీనాక్షికనుదోయి మించుదీపములాయ-
నాననసుధారంబభిషేకమాయ

చ. 2:

మగువ చిరునవ్వులే మంచిక్రొవ్విరులాయ
తగుమేనితావి చందనమలఁదుటాయ
నిగనిగని తనుకాంతి నీరాజనంబాయ
జగడంపుటలుకలుపచారంబులాయ

చ. 3:

ననుపైన పొందులే నైవేద్యతతులాయ
తనివోని వేడుకలు తాంబలమాయ
వనిత తిరువేంకటేశ్వరుని కౌఁగిటఁ జేయుఁ
వినయవివరంబులరవిరిమొక్కులాయ