పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0079-4 ఆహిరి సం: 05-286

పల్లవి:

ఇన్నియుఁ జేసితివిఁకనేలా నీ-
చిన్నినగపు మూసెర నీచేఁత

చ. 1:

మఱవకురా నీమాటలు ని-
న్నెఱుఁగుదు నిన్నియు నిఁకనేలా
మొఱఁగకురా నీమోహము నా-
చెఱఁగు మాసెనిదె చెల్లె నీచేఁత

చ. 2:

చిందకురా నీ చెలువములు ఇపు-
డిందరునున్నారిఁకనేలా
కందకురా నీ కాఁకలను యిటు
కిందుపడితినిదె గెలిచె నీచేఁత

చ. 3:

నొంపకురా నే నొగులఁగా నీ-
యింపులు నెరపేనిఁకనేలా
జంపుల వేంకటశైలపతీ నా-
కెంపుమోవి దక్కెర నీచేఁత