పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0079-3 ముఖారి సం: 05-285

పల్లవి:

సెల్లునంటా నేమైన చేయవచ్చేవు నే-
నొల్లనిన్ను సక్కసాయ నుండేవో వుండవో

చ. 1:

మేసవారి పిన్నదాని మేకుసేసి యింటిలోనఁ
దోసుకొంటివెఱఁగవా దుండగీఁడ
ఆసలఁ బెట్టేవు నన్ను నట్టనే యింతేసి
వేసాలఁబోక కొంగు వీడేవో వీడవో

చ. 2:

పాయపు వలపులనే పైడివంటి గొల్లెతల
సాయంపంపి తొలఁగవా సటకాఁడ
మాయల- బెట్టుచు నీవు మంచునీరు కుంచాలఁ
బోయుచు నన్నేఁపక పోయేవో పోవో

చ. 3:

గాఁటమైన గుబ్బల చక్కనిదాని నమ్మనంటా
ఆఁటదాని బాగొనేవడవిలోనే
నాఁటకపు వేంకటేశ నన్నుఁ గూడితివి యిట్టె
మాఁటనెందూనాడక మానేవో మానవో