పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0079-2 ముఖారి-అటతాళం సం: 05-284

పల్లవి:

చేయరాని చేఁతలెల్లఁ జేసితివి యింత
పాయరాని సతిమీఁద భయము నీకెట్టిదో

చ. 1:

ముత్తేల పెండెమిది ముదితది ఆ-
గుత్తపుఁ బాదమునకుఁ గొలఁదైనది
బిత్తరపు ముంజేతనే పెట్టితిని యీ -
మత్తగజగమనపై మన్నన నీకెట్టిదో

చ. 2:

కుందనంపు మట్టెలివి కోమలివి మోఁత-
లందెలతో జగడించనందమైనవి
యిందు నీకు నుంగరాలై యేచినవి యీ-
యిందుముఖి మీఁది మోహమెంత నీకునెట్టిదో

చ. 3:

గట్టివలిపెపు చంద్రకాని యిది యింతి
కట్టి విడిచిన నేఁటికమ్మఁదానిది
కట్టి కాసించితివి వేంకటరాయా యీ -
బెట్టైన చెలిమీఁదిప్రేమము నీకెట్టిదో