పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0079-1 కేదారగౌళ సం: 05-283

పల్లవి:

రమ్మనవే వాని రమ్మనవే- యీ-
తమ్మికనుఁగొనల తళుకులవాని

చ. 1:

మెలుపున నేను మేడమీఁద యీ-
చిలుకఁ బేరుకొని పిలువఁగను
అలపున వీథిఁ దానరుగుచును తనుఁ
బిలిచితినంటాఁ బలికినవాని

చ. 2:

కేరడమైన కిన్నెరలో యీ-
నారణి ముట్టుచు నలుగడను
చేరువల తాఁజెలఁగుచును యిటు
పేరుకొనుచు ననుఁ బిలిచినవాని

చ. 3:

పరవశమై నేఁ బానుపున యీ-
గిరికుచముల నొడ్డగిలఁగాను
తిరువేంకటఘనగిరిపతి ననుచును యీ-
సిరులుగ ననునిటు చెనకినవాని