పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0078-6 భూపాళం సం: 05-282

పల్లవి:

ఇన్నిచేఁతలును జేసెనిందుకొరకే - వీఁడు
కన్నులనె పొద్దుపుచ్చీఁ గదవె నీకొరకే

చ. 1:

మీనమాయఁ జెమటల మేను ముంచుకొరకే
తానే కమఠమునాయ దాఁగుకొరకే
ఆనుకొని కిటియాయ నదలించుకొరకే
మానఁడు కంబముచాటు మారుమోముకొరకే

చ. 2:

కాలుచాఁచె నేలమీఁద గమనించుకొరకే
జాలిఁబెట్టె చేఁతలనే చంపుకొరకే
యేలికాయ విరహులనేఁ పెడికొరకే
శైలమెత్తె నీకుచములెత్తే కొరకే

చ. 3:

కలవెల్ల నిరసించేఁ గదవె నీకొరకే
కలికియాయెను నీసంగతికొరకే
వలపుల వేంకటేశ్వరుఁడు లోకమున
చెలువముతో మెరసెను నీకొరకే