పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0078-5 శ్రీరాగం సం: 05-281

పల్లవి:

పువ్వుగట్టినట్టి మేన- బుక్కిలించీఁ జెమట నీ-
జవ్వనపు మదమెపో చలపట్టిని

చ. 1:

మోలకనవ్వు చిగురుమోవి మోపనీక నీ-
పలుకుఁ గోవిలలె పో పగచాటీని
తిలకపుమోమునకుఁ దేంట్ల రానీక నీ-
యలకల చెదరె పో యదలించీని

చ. 2:

చనవున నీముఖచందురుని వంక నీ-
చనుజక్కవలె పో చాడిచెప్పీని
మనసు చీఁకట్ల నీమదనతాపపుఁ జింత
కనుఁగవలె పో గాదెఁబోసీని

చ. 3:

దటపుఁ దమకపు మైదావానలానకు
నిట్టూపురులె పో నీడవెట్టీని
గుట్టుతోనుండిన కూరిమిపంపులే పోనీ-
పట్టపు వేంకటపతిఁ బట్టి తెచ్బీని