పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0078-4 దేవగాంధారి సం: 05-280

పల్లవి:

ఎంతటివాఁడవు నిన్ను నేమందును యిట్టె
సంతమైతివింతితోడ చాలదా నీకు

చ. 1:

మాణికపుటుంగరాల మగువ దా వాయించేటి-
వీణలోనే చల్లీఁ దనవిరహమెల్లను
ఏణనయన నింతేసి యెలయించినట్టి నీ-
జాణతనమె యింత చాలదా నీకు

చ. 2:

గిలుకుఁగంకణముల కీరవాణి కిన్నెరలో
కులికీనిదె పై కోపమెల్లాను
సొలపుఁ జూపులనిట్టే సుదతినింతేసి నీ-
చలము సాదించితివి చాలదా నీకు

చ. 3:

కుంకుమగుబ్బలతోడి కోమలిచెక్కు చెమట-
వంకనే వచ్చీ నీపై వలపెల్లను
వేంకటగిరిరమణ వేడుక నీలలితాంగి
సంకెదేరఁ గూడితివి చాలదా నీకు