పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0078-3 శ్రీరాగం సం: 05-279

పల్లవి:

ఉండవద్దా యిటువంటి వొడికాలను చను-
గొండలపై నుదయించెఁ గొండుక చందురుఁడు

చ. 1:

మింటిమీఁది చందురుఁడు మేదినిపై కలువల
నంటు సేసెనట యేఁటి నాటకములే
కంటిచూపు కలువల కలకకోరిచెఁ బైఁడి-
వంటిమేని జవరాలి వదన చందురుఁడు

చ. 2:

జలధిలో జనియించి చందురుఁడె పగలాయ
జలజములకు నేఁటి శాంతములే
మెలుఁతమోమై నేఁడు మెత్తనికరతలము-
జలజానఁ బవళించెఁ జక్కని చందురుఁడు

చ. 3:

చింకచందురుఁడు కందుఁజీఁకటి మైచీఁకటే
యింకఁజేసి పారఁదోలీనేఁటిపాందులే
వేంకటేశుని కౌఁగిట వెలఁదిమోమై నేఁడు
వంక నెరిచీఁకటి వలఁచె జందురుఁడు