పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0078-2 ఆహిరి సం: 05-278

పల్లవి:

ఇట్టే నామదిఁ గోపమెచ్చరించేవు
వట్టి వలుపే నాపై వారించ వలెనా

చ. 1:

మోహపు సంకుటుంగరముల వెలిగోర నా-
దేహముపై నునురేక దియ్యఁజూచేవు
సాహసివిరా వోరి వెచ్చపు నీవలపులోని-
దాహమెల్లా నాతోనే యింతటఁ జూపవలెనా

చ. 2:

తళుకుబంగారంచుల దట్టి చీరకొంగుఁ
లలర నీమేను నాపైనప్పళించేవు
వలదు వోరి వెచ్చపువలపు నీదెల్లాను
పలుమారునిట్ల నాపైఁ బూయవల నా

చ. 3:

సన్నపుమణుల కుప్పెనసవరము కొప్పు నా-
కన్నులు దాఁకఁగ నాపైఁ గడు వీఁగేవు
కన్నుల కలికి వేంకటరాయ నీకౌఁగిటి
వన్నెలెల్ల నాపై నిటువలెఁ జేయవలెనా