పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0078-1 భూపాళం సం: 05-277

పల్లవి:

ఎందరు వలె నీకింకాను - యీ-
యిందరు చాలర యింకాను

చ. 1:

మోహపు సతితో ముచ్చటఁ గలసిన-
దేహము మనసునిదియ కాదా
సాహసమున నది చాలక మదిలో
యీహలఁ దిరిగే వింకాను

చ. 2:

కసరుల మురిపెపు గయ్యాళిసతులతో
ఆసురుసురులతో నలసితివి
కొసరుచు నాతోఁ గూటమిసేసే-
ఎసరెత్తకుమీ యింకాను

చ. 3:

కాఁకల నటనల- గరగింపుచు నను
దేఁకువఁ గూడితి దిమ్మరివై
వేఁకపువలపుల వేంకటేశ నీ-
యేఁకట దీరదు యింకాను