పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0077-6 శ్రీరాగం సం: 05-276

పల్లవి:

నేనెందు వోయె తా నెందు వోయీ
రానీలే రానీలే రానీలే

చ. 1:

మీనైన నాఁటి తన మిడుకెల్ల దిగవలెకానీలే కానీలే కానీలే

చ. 2:

తలచూపేనాఁటి తలఁపెల్ల దిగవలె తలఁచనీ తలఁచనీ తలఁచనీవే

చ. 3:

కిరయైన నాఁటి కిటుకెల్ల దిగవలెతిరుగనీ తిరుగనీ తిరుగనీవే

చ. 4:

హరియైన నాఁటి అదటెల్ల దిగవలె జరగనీ జరగనీ జరగనీవే

చ. 5:

వడుగైన నాఁటి వస విడువఁగ వలె తడవకు తడవకు తడవకువే

చ. 6:

కలుషించే నాఁటి కడమెల్ల దిగవలె అలుగనీ అలుగనీ అలుగనీవే

చ. 7:

సతిఁ బాసేనాఁటి చల్లమెల్ల దిగవలె తతిగానీ తతిగానీ తతిగానీవే

చ. 8:

ముసలైన నాఁటి ముసుపెల్ల దిగవల్‌ విసుగనీ విసుగనీ వీసుగనీవే

చ. 9:

మానైన నాఁటి మదమెల్ల దిగవలె పోనీవే పోనీవే పోనీవే

చ. 10:

కలికైన నాఁటి గజరెల్ల దిగవలె చెలఁగనీ చెలఁగనీ చెలఁగనీవే

చ. 11:

వేడుకతో నాఁటి వేంకటపతి నన్నుఁ గూడనీ కూడనీ కూడనీవే