పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0077-5 ముఖారి సం: 05-275

పల్లవి:

పొద్దువోకలివి నీకు భువిలో నెన్నఁగ నీ-
సుద్దులు చెప్పెదమన్న చూడఁజూడఁ గొత్తలు

చ. 1:

మోఁతనీటిలోని యీఁత మూఁపునఁ బుట్టిన మేఁత
మూఁతిమీఁది కత్తికోఁత మొనగోరివాఁత
బాఁతిలేని దారవోఁత పాపముచూడనిచేఁత
నాఁతిమీఁది తలపోఁత నాఁగేటిగీఁత

చ. 2:

వలపు చల్లినలాగు వాజినెక్కినబాగు
వలసి నొల్లములైన వలవనిజాగు
తెలిసితిమిదెనేఁడు తిరువేంకటేశ్వర
తలఁపు ప్రాణులమీఁద- దగులుటేలాగు