పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0077-4 హిందోళవసంతం సం: 05-274

పల్లవి:

జగడపుఁ జనవుల జాజర
సగినల మంచపు జాజర

చ. 1:

మొల్లలు దురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లనఁ బుప్పొడి జారఁగఁ బతిపై
చల్లేరతివలు జాజర

చ. 2:

భారపుఁ గుచముల పైపైఁ గడు సిం-
గారము నెరుపేటి గందవొడి
చేరువ పతిపై చిందఁగఁ బడఁతులు
సారెకుఁ జల్లేరు జాజర

చ. 3:

బింకపుఁ గూటిమి పెనఁగేటి చెమటల-
పంకపుఁ బూఁతల పరిమళము
వేంకటపతిపై వెలఁదులు నించేరు
సంకుమదంబుల జాజర