పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0005-1 శ్రీరాగం సం: 05-026

పల్లవి:

అప్పటి యెండ చెమటలట్టే వుండీనా
నెప్పు దప్ప బొంకేవు నే నెఱుంగనా

చ. 1:

ఆవులఁ గాచిన నాటి యడవికంపల జీర-
లావల నేఁడు మాయక అట్టే వుండీనా
యేవంక నెవ్వతో నిన్ను నెనసి చేసిన చేఁత
నీ వెంత మొఱఁగిన నే నెఱంగనా

చ. 2:

వెన్నలు ముచ్చిలునాఁడు వేడి పాలారగించిన
అన్నువ నీమోవిపొక్కులట్టే వుండీనా
వన్నెకాడ యెవ్వతెకో వలలఁ జిక్కిన నీ-
నిన్న మొన్నటి సుద్దులు నే నెఱంగనా

చ. 3:

రంగుగ మధురలోనీ రమణి మెత్తిన నాటి-
అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా
చెంగట మొఱగి కలసితివి వేంకటరాయ
నింగి మోచిన చేఁతలు నే నెఱంగనా